క్యారెట్‌ పచ్చడి

ABN , First Publish Date - 2015-08-30T20:38:36+05:30 IST

కావలసిన పదార్థాలు: క్యారెట్టు ముక్కలు - 2 కప్పులు, పచ్చిమిర్చి - 2, మెంతి ఆకులు - ఒక కప్పు

క్యారెట్‌ పచ్చడి

కావలసిన పదార్థాలు: క్యారెట్టు ముక్కలు - 2 కప్పులు, పచ్చిమిర్చి - 2, మెంతి ఆకులు - ఒక కప్పు, శనగపప్పు - ఒక టీస్పూను, మినప్పప్పు - ఒక టీ స్పూను, జీలకర్ర - ఒక టీస్పూను, ఎండుమిర్చి - 4, వెల్లుల్లి రేకలు - 4, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: నూనెలో క్యారెట్‌ తురుము, పచ్చిమిర్చి వేసి పచ్చివాసన పోయేంత వరకూ వేగించుకుని పక్కకు తీసుకోవాలి. అదే నూనెలో మెంతి ఆకులను కూడా వేగించాలి.శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర దోరగా వేపుకుని అన్ని మిశ్రమాలను కలిపి రుబ్బుకోవాలి. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. ఈ పచ్చడి అన్నం, దోశలలోకి బాగుంటుంది.

Updated Date - 2015-08-30T20:38:36+05:30 IST