దోసకాయ గుడ్ల కూర

ABN , First Publish Date - 2015-08-30T18:01:29+05:30 IST

కావలసిన పదార్థాలు: (ఉడికించిన) గుడ్లు - 6, ఉల్లి తరుగు - 1 కప్పు, దోస ముక్కలు - 1 కప్పు, టమోటా తరుగు - అరకప్పు

దోసకాయ గుడ్ల కూర

కావలసిన పదార్థాలు: (ఉడికించిన) గుడ్లు - 6, ఉల్లి తరుగు - 1 కప్పు, దోస ముక్కలు - 1 కప్పు, టమోటా తరుగు - అరకప్పు, గరం మసాల - అర టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - 1 టీ స్పూను, కొత్తిమీర - 1 కట్ట, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, కారం, పసుపు, ఉప్పు, నూనె - సరిపడా.
తయారుచేసే విధానం: నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టులని దోరగా వేగించి పసుపు, కారం, ఉప్పు, టమోటా తరుగు, దోసముక్కలు వేసి కొద్దిసేపు తర్వాత కప్పు నీరుపోయాలి. గుడ్లకు గాటు పెట్టుకుని ఉడికే కూరలో వేసి పది నిమిషాల తర్వాత దించేసి గరం మసాల, కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి.

Updated Date - 2015-08-30T18:01:29+05:30 IST