కార్న్‌ ప్రాన్స్‌

ABN , First Publish Date - 2015-08-30T17:57:09+05:30 IST

కావలసిన పదార్థాలు: పెద్ద రొయ్యలు - 2, కూరగాయలు ఉడికించిన నీరు -400 గ్రా., అల్లం - 10 గ్రా

కార్న్‌ ప్రాన్స్‌

కావలసిన పదార్థాలు: పెద్ద రొయ్యలు - 2, కూరగాయలు ఉడికించిన నీరు -400 గ్రా., అల్లం - 10 గ్రా., వెల్లుల్లి -10 గ్రా., మొక్కజొన్నపిండి - 1 టేబుల్‌ స్పూను, నూనె - వేగించడానికి సరిపడా.
రొయ్యలకు పట్టించడానికి: మొక్కజొన్న పిండి - 30 గ్రా., తెల్లసొన - 2 గుడ్లవి, ఉప్పు రుచికి తగినంత.
తయారుచేసే విధానం: రొయ్యల్ని ముందుగా పొట్టుతీసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక పాత్రలో మొక్కజొన్నపిండి, గుడ్ల తెల్లసొన, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ జారులో రొయ్యల్ని ముంచి, నూనెలో 80 శాతం దాకా వేగించాలి. ఇపడు మరో పాత్రలో టేబుల్‌ స్పూను నూనె వేసి అల్లం, వెలుల్లి ముక్కల్ని వేగించి కూరగాయలు ఉడికించిన నీటిని కలపాలి. నీళ్లు మసులుతుండగా రొయ్యల్ని ఇందులో వేసి మిగతా 20 శాతం ఉడికించాలి. ఒక టేబుల్‌ స్పూను మొక్కజొన్నపిండి నీళ్లలో కలిపివేసి కాసేపుంచి దించేయాలి. ఇది అన్నంలోకి నంజుకోడానికి బాగుంటుంది..

Updated Date - 2015-08-30T17:57:09+05:30 IST