Abn logo

ఫ్రైడ్‌ ఐస్‌క్రీమ్‌

కావ

లసినవి: వెనిలా ఐస్‌క్రీమ్‌ 2 స్కూప్‌లు, కొబ్బరి పొడి 2 కప్పులు, మైదా ఆరు టేబుల్‌ స్పూన్‌లు, కార్న్‌ఫ్లార్‌ 2 టీ స్పూన్లు, కస్టర్డ్‌ పౌడర్‌ ఆరు టీ స్పూనులు, పాలపొడి 4 టీ స్పూన్లు, నూనె వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం
ఐస్‌క్రీమ్‌ బాగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి. మైదా, కార్న్‌ఫ్లార్‌లను కలిపి జల్లించి నీళ్ళతో గట్టి పిండిలా కలుపుకోవాలి. ఒక ఐస్‌క్రీమ్‌ స్కూప్‌ను అరచేతిలో పెట్టుకుని కొబ్బరి పొడితో దాన్ని మూసేయాలి. ఆ ఉండను మైదా, కార్న్‌ఫ్లార్‌ల పిండిలో ముంచి మళ్ళీ కొబ్బరి పొడితో మూసేయాలి. ఈ పని వేగంగా జరగాలి. అప్పటికే నూనె వేడిచేసి పెట్టుకోవాలి. మంట తగ్గించి ఈ ఐస్‌క్రీమ్‌ ఉండను నూనెలో వేసి బంగారు రంగు వచ్చేదాకా అంటే అర నిమిషం మాత్రమే వేగించాలి. ఈ కొలతలు రెండు స్కూప్‌లకు అంటే ఇద్దరికి మాత్రమే సరిపోయేవి. ఈ ఐస్‌క్రీమ్‌ను రెండుగా కోసి పైన జామ్‌గాని, టూటీఫ్రూటీగాని వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది.

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలివైభవంగా లక్ష దీపోత్సవంకోతుల నియంత్రణేది ? ఒమైక్రాన్‌ రాకుండా జాగ్రత్త వహించాలివ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలివాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి శాంతి భద్రతల పరిరక్షణకే నిర్బంధ తనిఖీలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న పాలకులు ఫీడింగ్‌ చాంబర్‌కు జాతీయస్థాయి అవార్డు దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి
Advertisement