జఫ్రన్‌ షర్బత్‌

ABN , First Publish Date - 2015-08-30T17:15:57+05:30 IST

కావలసిన పదార్థాలు : పాలు - 1లీటరు, కుంకుమపువ్వు - 12 కాడలు (2 టేబుల్‌ స్పూన్ల గోరువెచ్చని పాలలో నానబెట్టాలి)

జఫ్రన్‌ షర్బత్‌

కావలసిన పదార్థాలు : పాలు - 1లీటరు, కుంకుమపువ్వు - 12 కాడలు (2 టేబుల్‌ స్పూన్ల గోరువెచ్చని పాలలో నానబెట్టాలి), పంచదార - 3 టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి - పావు టీ స్పూను, రాత్రి నానబెట్టిన బాదం పప్పులు - 12, పిస్తా - 8, జీరాపొడి - చిటికెడు.
తయారుచేసే విధానం: దళసరి అడుగున్న పాత్రలో పాలు, కుంకుమపువ్వు వేసి సన్నని మంటపై 10 నిమిషాలు వేడి చేయాలి. పంచదార, యాలకులపొడి కూడా వేసి మరో 5 నిమిషాలు వేడిచేసి దించేయాలి. సన్నగా తరిగిన బాదం, పిస్తా పలుకుల్ని వేసి బాగా కలపాలి. గది ఉష్ణోగ్రతలోకి వచ్చాక ఫ్రిజ్‌లో ఉంచి బాగా చల్లబడ్డాక తీసి గ్లాసుల్లోకి నింపి పైన జీరా పొడి చల్లాలి. ఈ షర్బత్‌ వేసవి తాపాన్ని తీర్చే ఔషధంలా పనిచేస్తుంది.

Updated Date - 2015-08-30T17:15:57+05:30 IST