బెంగళూరు వంకాయ కూటు

ABN , First Publish Date - 2015-08-29T23:33:47+05:30 IST

కావలసిన పదార్థాలు: పెసరపప్పు - 150 గ్రా., బెంగళూరు వంకాయ - 1, ఉల్లిపాయ - 1, టమోటా - (చిన్నది) 1

బెంగళూరు వంకాయ కూటు

కావలసిన పదార్థాలు: పెసరపప్పు - 150 గ్రా., బెంగళూరు వంకాయ - 1, ఉల్లిపాయ - 1, టమోటా - (చిన్నది) 1, పచ్చిమిర్చి - 3, పచ్చి కొబ్బరి తురుము - 3 టీ స్పూన్లు.
తాలింపు కోసం: నూనె - 2 టీ స్పూన్లు, ఆవాలు - అర టీ స్పూను, శనగపప్పు - 1 టీ స్పూను, జీలకర్ర, మెంతులు - పావు టీ స్పూను చొప్పున, ఎండుమిర్చి - 3, ఇంగువ - చిటికెడు.
తయారుచేసే విధానం: పెసరపప్పులో చిటికెడు పసుపు కలిపి మూడు కప్పుల నీటిలో ఉడికించాలి. పప్పు మూడొంతులు మెత్తబడ్డాక బెంగళూరు వంకాయ, టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి, తగినంత ఉప్పు, ఒక కప్పు నీరు పోసి మూత పెట్టాలి. ముక్కలు మెత్తబడ్డాక మంట తీసేయాలి. ఇప్పుడు మరో కడాయిలో తాలింపు వేసి కూటులో కలపాలి. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా రుచిగా ఉండే వంటకం ఇది.

Updated Date - 2015-08-29T23:33:47+05:30 IST