చందువా చిప్స్‌

ABN , First Publish Date - 2015-08-29T23:24:04+05:30 IST

కావలసినవి: మీడియం సైజు చందువా చేప ఒకటి, నిమ్మరసం 2 టీ స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి, ఆవపిండి

చందువా చిప్స్‌

కావలసినవి:  మీడియం సైజు చందువా చేప ఒకటి, నిమ్మరసం 2 టీ స్పూన్లు, ఉప్పు, మిరియాల పొడి, ఆవపిండి, నూనె తగినంత, బ్రెడ్‌ పొడి కొద్దిగా, మైదా 2 టేబుల్‌ స్పూన్లు, గుడ్డు ఒకటి.
ఎలా చేయాలి
చేపని నాలుగు ముక్కలుగా కట్‌ చేసి వాటిలో ముళ్లని తీసివేసి శుభ్రంగా కడగాలి. నిమ్మరసంలో ఉప్పు, మిరియాల పొడి, ఆవపిండి బాగా కలిపి చేపకు పట్టించి పది నిమిషాల పాటు ఉంచేయాలి. గుడ్డు సొనని గిలక్కొట్టి అందులో మైదా, ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. కొద్దిగా నీళ్లు కూడా పోసి జారుడుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో చేప ముక్కల్ని ముంచి బ్రెడ్‌ పొడిలో దొర్లించి కాగిన నూనెలో బాగా వేగించాలి. వీటిని వేడి వేడిగా ఏదన్నా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-08-29T23:24:04+05:30 IST