ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌

ABN , First Publish Date - 2015-08-26T22:38:44+05:30 IST

కావలసిన పదార్థాలు : గుడ్లు - 3, ఉల్లిపాయ - 1, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - పావు టీ స్పూను

ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌

కావలసిన పదార్థాలు : గుడ్లు - 3, ఉల్లిపాయ - 1, ఉప్పు - రుచికి తగినంత, మిరియాల పొడి - పావు టీ స్పూను, పచ్చిమిర్చి - 1, ఉల్లికాడల తరుగు - గుప్పెడు, నూనె - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం : ఒక గిన్నెలో గుడ్ల సొన, ఉప్పు, (కొద్దిగా) మిరియాలపొడి వేసి బాగా గిలకొట్టాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు నూనెలో దోరగా వేగాక ఉల్లికాడ, పచ్చిమిర్చి తరుగు (పెద్దమంటపై) గుడ్ల మిశ్రమం ఒకటి తర్వాత ఒకటి వేగించి, మిగిలిన మిరియాలపొడి చల్లాలి. ఇప్పుడు అన్నం వేసి బాగా కలిపి వేడి వేడిగా తినాలి.


Updated Date - 2015-08-26T22:38:44+05:30 IST