ఆలూ ఎగ్‌ కోఫ్తా

ABN , First Publish Date - 2015-08-26T22:40:27+05:30 IST

కావలసిన పదార్థాలు: ఉడికించిన గుడ్లు - 4, ఆలూ - 50 గ్రా., ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2, కొత్తిమీర - 1 కట్ట

ఆలూ ఎగ్‌ కోఫ్తా

కావలసిన పదార్థాలు: ఉడికించిన గుడ్లు - 4, ఆలూ - 50 గ్రా., ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2, కొత్తిమీర - 1 కట్ట, బ్రెడ్‌పొడి - 100 గ్రా., మొక్కజొన్నపిండి - 50 గ్రా., జీరాపొడి - అర టీ స్పూను, గరం మసాలా - అర టీ స్పూను, ఉప్పు- రుచికి తగినంత, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: ముందుగా కూరగాయల్ని సన్నగా తరుక్కోవాలి. ఆలూని ఉడికించి మెదపాలి. మొక్కజొన్న పిండిని నీళ్లతో చిక్కగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆలూలో తరిగిన కూరగాయలు, మసాలా పొడులు వేసి బాగా కలపి ఈ మిశ్రమాన్ని గుడ్డు చుట్టూ అతికించాలి. వాటిని మొక్కజొన్న పిండిలో ముంచి తీసి, బ్రెడ్‌పొడిలో పొర్లించాలి. వీటిని నూనెలో దోరగా వేగించుకుని టమాటా సాస్‌తోగాని, పుదీనా చట్నీతో గాని తింటే బాగుంటాయి.

Updated Date - 2015-08-26T22:40:27+05:30 IST