మిరియాల అన్నం

ABN , First Publish Date - 2018-10-06T18:53:28+05:30 IST

నూనె- రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం-ఒక టీస్పూను, ఎరుపు, ఆకుపచ్చ కాప్సికం ముక్కలు...

మిరియాల అన్నం

కావలసినవి
 
నూనె- రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం-ఒక టీస్పూను, ఎరుపు, ఆకుపచ్చ కాప్సికం ముక్కలు- ఒక్కొక్కటీ ఒక్కో అరకప్పు, కరివేపాకు-గుప్పెడు, ఉల్లిపాయముక్కలు-పావు కప్పు, కారం-చిటికెడు, ఉప్పు-అర టీస్పూను, వండిన అన్నం- ఒక కప్పు, నల్లమిరియాలపొడు-ముప్పావు టీస్పూను, గరంమసాలా- పావు టీస్పూను, కొత్తిమీర-గుప్పెడు, నిమ్మరసం-ఒక టీస్పూను.
 
తయారీవిధానం
 
ఒక కడాయిలో రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో పైన చెప్పిన కొలతల ప్రకారం అల్లం, వెల్లుల్లి ముక్కలు, ఎరుపు, ఆకుపచ్చ కాప్సికం ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయముక్కలు, కారం, ఉప్పు వేసి వేగించాలి. అందులో ఉడికిన అన్నాన్ని, ముప్పావు టీస్పూను నల్లమిరియాల పొడిని వేసికలపాలి. తర్వాత గరం మసాలా, కొత్తిమీర, నిమ్మరసాలను వేసి కలపాలి. మిరియాల అన్నం రెడీ.

Updated Date - 2018-10-06T18:53:28+05:30 IST