Abn logo

గుమ్మడికాయ మజ్జిగ

కావలసినవి
 
గుమ్మడికాయముక్కలు- 250గ్రాములు (పొట్టు, గింజలు తీసేసి),శెనగపప్పు- మూడు టీస్పూన్లు, తాజా కొబ్బరి- ఒక కప్పు (తరుగు), పచ్చిమిర్చి- నాలుగు, కొత్తిమీర- పావుకప్పు (తరుగు), అల్లం- చిన్న ముక్క, ఉప్పు- సరిపడా, పెరుగు- ఒక కప్పు (ఒక కప్పు నీళ్లు పోసి బ్లెండర్‌లో కొట్టాలి), వంటనూనె- రెండు టీస్పూన్లు, ఆవాలు- అర టీస్పూను, జీలకర్ర- ఒక టీస్పూను, ఇంగువు- పావు టీస్పూను, కరివేపాకులు- కొన్ని.
 
తయారీవిధానం
పావు కప్పు నీళ్లల్లో శెనగపప్పును వేసి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. కుక్కర్‌లో గుమ్మడికాయముక్కలను ఉడికించాలి. కొబ్బరి, శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, ఉప్పును కలిపి మెత్తటి పేస్టులా చేయాలి. సాస్‌పాన్‌లో ఉడికిన గుమ్మడికాయముక్కలు, కొబ్బరి మిశ్రమాన్ని వేసి కలపాలి. అందులో ఒక కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి, స్టవ్‌ మీద ఉడికించాలి. కర్రీ మెల్లగా చిక్కగా తయారవుతుంది. ఆ సమయంలో ఒకసారి కర్రీని కలిపి, నిమిషం పాటు ఉడికించి దించాలి. చిన్న సాస్‌పాన్‌లో నూనెను వేడి చేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు వేసి వేగించాలి. ఆ తాలింపును కూరలో వేయాలి. వేడి వేడి అన్నంలో గుమ్మడికాయ మజ్జిగ కూర వేసుకుని తింటే ఆ రుచే వేరు.

అగ్రిసెజ్‌ దిశగా అడుగులు రగడఆర్థిక సమస్యలతో దంపతుల ఆత్మహత్యా యత్నంఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలిజూన్‌ 2న ఆవిర్భావ వేడుకలురుణాలను సకాలంలో మంజూరు చేయాలి : కలెక్టర్‌ అందుబాటులోకి అన్ని బస్సు సర్వీస్‌లుజాతీయ ఉపకార వేతనాలకు 32 మంది ఎంపికఎన్టీఆర్‌ సేవలు మరువలేనివి సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement