గోరు చిక్కుడు పొడి కూర

ABN , First Publish Date - 2017-10-28T23:53:57+05:30 IST

గోరుచిక్కుడు - పావు కేజీ, ఉల్లి తరుగు - 2 కప్పులు, ఉప్పు - రుచికి సరిపడా, పసుపు - అర టీ స్పూను..

గోరు చిక్కుడు పొడి కూర

కావలసిన పదార్థాలు
 
గోరుచిక్కుడు - పావు కేజీ, ఉల్లి తరుగు - 2 కప్పులు, ఉప్పు - రుచికి సరిపడా, పసుపు - అర టీ స్పూను, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు - తిరగమోతకు సరిపడా, పొడి కోసం : ఎండు కొబ్బరి - 2 టేబుల్‌ స్పూన్లు, పుట్నాలు - ఒక టేబుల్‌ స్పూను, ఎండు మిర్చి - 3, వెల్లుల్లి - 3 రెబ్బలు, జీలకర్ర - అర టీ స్పూను, ధనియాలు - ఒక టీ స్పూను.
 
తయారుచేసే విధానం
 
నార తీసి, (అంగుళం) ముక్కలుగా చిదిమిన గోరుచిక్కుడులో సరిపడా నీరు, చిటికెడు ఉప్పు వేసి 10 నిమిషాలు ఉడికించి నీరు వడకట్టి పక్కనుంచాలి. పుట్నాలు, వెల్లుల్లి మినహా తక్కినవాటిని కొద్దిసేపు వేగించి చల్లారిన తర్వాత అన్నీ కలిపి బరకగా పొడి చేసుకోవాలి. కడాయిలో నూనె వేసి తాళింపు, ఉల్లి తరుగు ఒకటి తర్వాత ఒకటి వేగించి పసుపు, ఉప్పు, ఉడికించిన గోరుచిక్కుడు వేసి మూత పెట్టి 6 నిమిషాలు మగ్గించాలి. తర్వాత పొడి వేసి మరో 3 నిమిషాలు ఉంచి దించేయాలి. వేడి అన్నంతో ఈ కూర బాగుంటుంది.

Updated Date - 2017-10-28T23:53:57+05:30 IST