ఉలువ పొంగనాలు

ABN , First Publish Date - 2017-11-19T20:09:07+05:30 IST

ఉలవలు - ముప్పావు కప్పు, ఇడ్లీ పిండి - 2 కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - 2, కరివేపాకు - 4...

ఉలువ పొంగనాలు

కావలసిన పదార్థాలు
ఉలవలు - ముప్పావు కప్పు, ఇడ్లీ పిండి - 2 కప్పులు, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - 2, కరివేపాకు - 4 రెబ్బలు. నూనె - వేగించడానికి సరిపడా.
 
తయారుచేసే విధానం
ఉలవల్ని ఒక రాత్రంతా నానబెట్టి ఉప్పు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. పాన్‌లో ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు తరుగు వేగించాలి. ఇప్పుడు ఇడ్లీ పిండిలో రుబ్బిన ఉలవల మిశ్రమంతో పాటు తాలింపు మిశ్రమం వేసి బాగా కలపి గుంతపొంగనాలు చేసుకోవాలి. ఏదైనా రోటీ పచ్చడితో పొంగనాలు వేడివేడిగా తింటే బాగుంటాయి.

Updated Date - 2017-11-19T20:09:07+05:30 IST