గోరు చిక్కుడు పప్పు కూర

ABN , First Publish Date - 2017-10-28T23:52:32+05:30 IST

గోరు చిక్కుడు - అర కేజీ, కంది పప్పు - వంద గ్రా., మినప్పప్పు - 3 టేబుల్‌ స్పూన్లు...

గోరు చిక్కుడు పప్పు కూర

కావలసిన పదార్థాలు
 
గోరు చిక్కుడు - అర కేజీ, కంది పప్పు - వంద గ్రా., మినప్పప్పు - 3 టేబుల్‌ స్పూన్లు, ఆవాలు, జీలకర్ర, కారం - 2 టీ స్పూన్ల చొప్పున, ఉప్పు - రుచికి సరిపడా, పసుపు - అర టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు.
 
తయారుచేసే విధానం
 
నార తీసి, చిన్న ముక్కలుగా తరిగిన గోరుచిక్కుడులో తగినంత నీరు పోసి మెత్తబడేవరకు ఉడికించి వడకట్టాలి. కంది పప్పులో తగినంత నీరు పోసి (ముద్దలా కాకుండా పలుకుగా) ఉడికించి వడకట్టి ఆరబెట్టాలి. బాణలిలో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు వేగించాక ఉడికించిన గోరుచిక్కుడు, కందిపప్పు, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించి దించేయాలి.

Updated Date - 2017-10-28T23:52:32+05:30 IST