అరటికాయ పొడి కూర

ABN , First Publish Date - 2017-09-02T22:18:21+05:30 IST

అరటి కాయలు - 3, శనగపప్పు, మినప్పప్పు - 2 టీ స్పూన్ల చొప్పున, ఆవాలు, జీలకర్ర - ఒక టీ స్పూను చొప్పున...

అరటికాయ పొడి కూర

కావలసిన పదార్థాలు
 
(కూర) అరటి కాయలు - 3, శనగపప్పు, మినప్పప్పు - 2 టీ స్పూన్ల చొప్పున, ఆవాలు, జీలకర్ర - ఒక టీ స్పూను చొప్పున, పచ్చిమిర్చి - 4, అల్లం - అంగుళం ముక్క, కరివేపాకు - 4 రెబ్బలు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నిమ్మరసం - ఒక టేబుల్‌ స్పూను, నూనె - 3 టేబుల్‌ స్పూన్లు.
 
తయారుచేసే విధానం
 
నూనె రాసిన అరటికాయల్ని నిప్పుల్లో లేదా, స్టౌవ్‌ పైన కాల్చి చల్లారిన తర్వాత పొడి గుజ్జుగా చేసి పక్కనుంచాలి. నూనెలో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, (కలిపి రుబ్బిన) అల్లం+పచ్చిమిర్చి ముద్ద .. ఒకటి తర్వాత ఒకటి వేస్తూ వేగించాలి. తర్వాత పసుపు, ఉప్పు, అరటి గుజ్జు కూడా వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. దించేముందు నిమ్మరసం పిండాలి.

Updated Date - 2017-09-02T22:18:21+05:30 IST