బ్రొకోలి సింపుల్‌ ఫ్రై

ABN , First Publish Date - 2017-06-17T19:04:26+05:30 IST

కావలసిన పదార్థాలు బ్రొకోలి - 150 గ్రా., శనగపిండి - 2 టేబుల్‌ స్పూన్లు, బియ్యప్పిండి - 1 టేబుల్‌ స్పూను, జీరాపొడి, పసుపు, కారం, ధనియాల

బ్రొకోలి సింపుల్‌ ఫ్రై

కావలసిన పదార్థాలు
 
బ్రొకోలి - 150 గ్రా., శనగపిండి - 2 టేబుల్‌ స్పూన్లు, బియ్యప్పిండి - 1 టేబుల్‌ స్పూను, జీరాపొడి, పసుపు, కారం, ధనియాల పొడి, ఆమ్‌చూర్‌ - ముప్పావు టీ స్పూను చొప్పున, జీలకర్ర - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టేబుల్‌ స్పూన్లు.
 
తయారుచేసే విధానం
 
నూనెలో జీలకర్ర వేగించి బ్రొకోలి కాడల్ని వేసి మూత పెట్టి చిన్నమంటపై మగ్గించాలి. ఈలోపు ఒక బౌల్‌లో కారం, పసుపు, బియ్యప్పిండి, శనగపిండి, ఆమ్‌చూర్‌, జీరా + ధనియాల పొళ్లు, ఉప్పు వేసి బాగా కలిపాలి. ఈ మిశ్రమాన్ని మగ్గిన బ్రొకోలిలో కొద్దికొద్దిగా వేసి కలిపి మూతపెట్టి మరో ఐదు నిమిషాలు మగ్గించి దించేయాలి. ఈ కూర అన్నంలో కలుపుకున్నా / సాంబారన్నంతో పాటు నంజుకున్నా బాగుంటుంది.

Updated Date - 2017-06-17T19:04:26+05:30 IST