పనస మసాలా కూర

ABN , First Publish Date - 2017-04-22T21:28:16+05:30 IST

కావాల్సిన పదార్థాలు పండిన పనస తొనలు-2-3 కప్పులు శెనగలు-1/2 కప్పు (4 గంటలు వీటిని నానబెట్టాలి)

పనస మసాలా కూర

కావాల్సిన పదార్థాలు
 
పండిన పనస తొనలు-2-3 కప్పులు
శెనగలు-1/2 కప్పు (4 గంటలు వీటిని నానబెట్టాలి)
కొబ్బరి తురుము- 1/2 కప్పు
ఉప్పు, అల్లం- తగినంత
జీలకర్ర- 1/2 టీస్పూను(వేయించినవి)
పచ్చి మిరపకాయలు-4-5
వెల్లుల్లి రెబ్బలు-3-4
కోకుమ్‌-2-3 పళ్లు (ఈ పళ్లు తీయగా, వగరుగా, ఉప్పగా, చేదుగా ఉంటాయి)
సిచుయాన్‌ పెప్పర్‌ (తెప్పాల్‌) - 6-7 (వీటిని పొడిచేసి నీటిలో నానబెట్టాలి)
నూనె- 2 టీస్పూన్లు
 
 
తయారీ విధానం
 
తురిమిన కొబ్బరి, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర అన్నింటినీ కలిపి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఒక బాణలిలో కొద్దిగా నూనె పోసి నానబెట్టిన శెనగల్ని అందులో వేసి లేత ఎరుపు రంగులోకి వచ్చేవరకూ వేయించాలి. అందులో పనస తొనలు వేసి వాటికి తగినంత ఉప్పు, పసుపు జోడించాలి. ఈ మిశ్రమాన్ని మెత్తగా అయ్యేవరకూ చిన్న మంటమీద ఉడికించాలి. ఆ తర్వాత కొబ్బరి పేస్టును ఇందులో కలిపి కొద్దిగా నీళ్లు పోయాలి. కూర ఉడికేటప్పుడు పొడిచేసి నానబెట్టిన తెప్పాల్‌ను, కోకుమ్‌ పళ్లను అందులో వేయాలి. అరగంటపాటు చిన్న మంట మీద కూరను ఉడకనిస్తే తెప్పాల్‌, కోకుమ్‌ పళ్ల సువాసన కూరలోకి బాగా ఇంకుతుంది. దీన్ని చపాతీతోగాని, అన్నంతోగాని తింటే చాలా బాగుంటుంది.

Updated Date - 2017-04-22T21:28:16+05:30 IST