బెండి కురి కురి

ABN , First Publish Date - 2016-07-29T17:07:52+05:30 IST

కావలసిన పదార్థాలు: బెండకాయలు: పావుకిలో, కారం: తగినంత, ఉప్పు: తగినంత, పసుపు: కొద్దిగా, గరం మసాలా పొడి: ఒకటిన్నర స్పూను, జీలకర్ర పొడి: పావు టీ స్పూను, చాట్‌ మసాలా: ఒకటిన్నర

బెండి కురి కురి

కావలసిన పదార్థాలు:  బెండకాయలు: పావుకిలో, కారం: తగినంత, ఉప్పు: తగినంత, పసుపు: కొద్దిగా, గరం మసాలా పొడి: ఒకటిన్నర స్పూను, జీలకర్ర పొడి: పావు టీ స్పూను, చాట్‌ మసాలా: ఒకటిన్నర స్పూను, శనగపిండి: మూడు టేబుల్‌ స్పూన్లు, మొక్కజొన్న పిండి: రెండు టీ స్పూన్లు, నిమ్మరసం: టేబుల్‌ స్పూను, నూనె: తగినంత
 
తయారీ విధానం: బెండకాయలను కావలసిన సైజులో తరిగిన తరువాత వాటికి ఉప్పు, కారం, పసుపు, మొక్కజొన్న పిండి, శనగపిండి, గరంమసాలా పొడి కొద్దిగా నూనె జత చేసి బాగా ముక్కలకు పట్టే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనెపోసి కొన్ని కొన్ని ముక్కల చొప్పున వేయించుకోవాలి. చివరగా నిమ్మరసం చల్లుకుంటే సరిపోతుంది.

Updated Date - 2016-07-29T17:07:52+05:30 IST