Advertisement
Advertisement
Abn logo
Advertisement

కార్న్‌ క్యూబ్స్‌

v>కావలసిన పదార్థాలు : మొక్కజొన్న పిండి (కార్న్‌ఫ్లోర్‌ కాదు)- 1/2 కప్పు, రిఫైన్డ మొక్కజొన్న పిండి(కార్న్‌ఫ్లోర్‌)- 1 టీ స్పూను, టోఫూ/పన్నీర్‌ తురుము- 1/2 కప్పు, మిరియాల పొడి- 1/4 టీ స్పూను, పచ్చిమిర్చి పేస్ట్‌- 1/4 టీ స్పూను, పెరుగు- 1/4 కప్పు, ఉప్పు- రుచికి సరిపడా, సోయా సాస్‌- ఒకటిన్నర టీ స్పూను, టొమేటా సాస్‌- 3 టీ స్పూన్లు, చిల్లీ సాస్‌- 1 టీ స్పూను, వెనిగర్‌- 1/2 టీ స్పూను, నూనె- వేగించడానికి సరిపడా, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లి కాడల తరుగు- ఒక్కోటి 1/2 టీ స్పూను చొప్పున.
 
తయారీ విధానం : ఒక గిన్నెలో టోఫూ/ పన్నీర్‌ తురుము, మొక్కజొన్న పిండి, కార్న్‌ ఫ్లోర్‌, ఉప్పు, మిరియాల పొడి, పచ్చిమిర్చి పేస్ట్‌, పెరుగు వేసి బాగా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు కూడా పోసి చపాతి పిండిలా చేసుకోవాలి. తరువాత దానిని ఒక పళ్ళెంలో సమానంగా సర్ది ఇడ్లీ ఉడికించినట్లుగా ఆవిరి మీద పావుగంట ఉడికించాలి. పదార్థం చల్లారిన తరువాత ముక్కలుగా కోయాలి. తరువాత పెనం మీద నూనె వేసి ఆ ముక్కలను వేగించి పక్కనుంచాలి. ఆ తరువాత ఒక బాణలిలో టీ స్పూను నూనె వేసి వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లికాడలను ఒక నిమిషం పాటు వేగించుకోవాలి. తరువాత సోయా సాస్‌, చిల్లీ సాస్‌, టొమేటా సాస్‌, వెనిగర్‌లను మూడు టీ స్పూన్ల నీళ్ళలో ఒక నిమిషం పాటు ఉడికించి దించేయాలి. వేగించుకున్న ముక్కలను ఈ సాస్‌ మిశ్రమంతో కలిపి వేడిగా తింటే బాగుంటుంది.
 
 
 
 
 
 
 
 

రామన్నకే స్టీరింగ్‌అభివృద్ధికి కృషిఎమ్మెల్సీ దండె విఠల్‌కు సన్మానంటీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా కోనేరు కోనప్పజిల్లా అభివృద్ధికి కృషి చేయాలి ఎల్‌ఈడీ లైట్లు ప్రారంభం జాతర ఏర్పాట్ల పరిశీలనబాల్క సుమన్‌ నియామకంతో పార్టీ బలోపేతం టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా బాల్క సుమన్‌త్యాగధనులను స్మరించుకోవాలి
Advertisement