గార్లిక్‌ నాన్

ABN , First Publish Date - 2016-02-21T20:48:38+05:30 IST

కావలసిన పదార్థాలు: మైదా- 2 కప్పులు, పెరుగు, గోరువెచ్చని పాలు- 1/2 కప్పు చొప్పున, వెన్న- 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- రుచికి తగినంత, బేకింగ్‌ సోడా, పం చదార,

గార్లిక్‌ నాన్

కావలసిన పదార్థాలు: మైదా- 2 కప్పులు, పెరుగు, గోరువెచ్చని పాలు- 1/2 కప్పు చొప్పున, వెన్న- 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- రుచికి తగినంత, బేకింగ్‌ సోడా, పం చదార, బేకింగ్‌ పౌడర్‌- 1/2 టీ స్పూను చొప్పున, వెల్లుల్లి తరుగు- 3 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు- 2 టీ స్పూన్లు
తయారీ విధానం: మైదాలో బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా, ఉప్పు వేసి బాగా కలిపాక దానిలో పెరుగు, పంచదార, పాలు వేసి ముద్దగా కలిపి నాలుగైదు గంటలు నానబెట్టాలి. తరువాత చపాతీ పీట మీద పిండి చల్లి కాస్త మందంగా చపాతీలు ఒత్తి వాటిపై కొద్దిగా వెల్లుల్లి, కొత్తిమీర తరుగులు చల్లి పైపైన మరోసారి ఒత్తాలి. వెల్లుల్లి చల్లిన వైపున కాకుండా రెండో వైపున చపాతీని పెనానికి అంటించి తవా ఫ్రై చేయాలి.

Updated Date - 2016-02-21T20:48:38+05:30 IST