టమోటా -గ్రీన్‌ పీస్‌ -కబాబ్‌ స్టిక్స్‌

ABN , First Publish Date - 2016-01-05T15:34:45+05:30 IST

కావలసిన పదార్థాలు: టమోటాలు - నాలుగు, పచ్చి బఠాణీలు - అర కప్పు, ఉడికించిన బంగాళదుంపలు - రెండు, జీడిపప్పు ముక్కలు - రెండు టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ

టమోటా -గ్రీన్‌ పీస్‌ -కబాబ్‌ స్టిక్స్‌

కావలసిన పదార్థాలు: టమోటాలు - నాలుగు, పచ్చి బఠాణీలు - అర కప్పు, ఉడికించిన బంగాళదుంపలు - రెండు, జీడిపప్పు ముక్కలు - రెండు టేబుల్‌ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు - రెండు టేబుల్‌ స్పూన్లు, మొక్కజొన్న పిండి - రెండు టేబుల్‌ స్పూన్లు, సన్నగా తరిగిన క్యారెట్‌ ముక్కలు - ఒక టేబుల్‌ స్పూను, గరంమసాలా - ఒక టీ స్పూను, పచ్చిమిరపకాయలు - మూడు, అల్లం - చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, పుదీన - నాలుగు రెమ్మలు, కొత్తిమీర - ఒక కట్ట, ఉప్పు - తగినంత.
తయారుచేయువిధానం: ముందుగా దుంపలను ఉడికించి పొడిచేసి పెట్టుకోవాలి, తర్వాత పచ్చి బఠాణీలను ఉడికించి పెట్టుకోవాలి. క్యారెట్‌, పుదీన, కొత్తిమీర కట్‌ చేయాలి. తర్వాత కడాయిలో నాలుగు స్పూన్లు నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్టు వేసి వేగించాలి. తగినంత ఉప, పుదీనా కూడా వేసి వేయించి , ఆపైన ఉడికించిన దుంప, గ్రీన్‌పీస్‌, క్యారెట్‌ , గరంమసాలా టమోటా ముక్కలు వేసి వేయించాలి. గట్టి కూర అయ్యాక దించి ఒక ప్లేట్‌లో పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక స్టిక్‌ తీసుకొని దాని చుట్టూ ఈ కూర పెట్టి గట్టిగా వత్తాలి. ఇప్పుడు దీనికి కాన్‌ఫ్లోర్‌ అద్దాలి. ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెనం మీద తగినంత నూనె వేసి ఈ స్టిక్స్‌ని అటు ఇటూ తిపతూ ఫ్రై చేయాలి. టమోటా సాస్‌తో నంజుకుని తింటే భలే రుచిగా ఉంటాయి.

Updated Date - 2016-01-05T15:34:45+05:30 IST