ముల్లంగి పెసర కూర

ABN , First Publish Date - 2015-08-29T23:22:32+05:30 IST

కావలసిన పదార్థాలు: ముల్లంగి (మీడియం సైజు) - 2, పెసరపప్పు - 200 గ్రా., ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి 3,

ముల్లంగి పెసర కూర

కావలసిన పదార్థాలు: ముల్లంగి (మీడియం సైజు) - 2, పెసరపప్పు - 200 గ్రా., ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి 3, వెల్లుల్లి రేకలు - 6, కరివేపాకు - 4 రెబ్బలు, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, శనగపప్పు + మినపప్పు + ఆవాలు + జీలకర్ర = 2 టీ స్పూన్లు, నూనె - అర టేబుల్‌ స్పూను, కొత్తిమీర - 1కట్ట.
తయారుచేసే విధానం: పెసరపప్పుని దోరగా వేగించి 2 గంటలు నానబెట్టాలి. ముల్లంగిని శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి. కడాయిలో నూనె వేసి మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేగనిచ్చి, తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, పసుపు కూడా వేసి వేగనివ్వాలి. తర్వాత ముల్లంగి తురుము, నానబెట్టి వడకట్టిన పెసరపప్పు వేసి సన్నని మంటపై మగ్గనివ్వాలి. ఈ లోపు వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉప్పు కలిపి గ్రైండ్‌ చేసుకుని ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని కూరలో వేసి మరికాసేపు మగ్గనిచ్చి దించేముందు కొత్తిమీర జల్లుకోవాలి. వేడి వేడి అన్నంలో ముల్లంగి పెసర కూర ఎంతో రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-08-29T23:22:32+05:30 IST