కాకరకాయ ఉల్లికారం

ABN , First Publish Date - 2015-09-23T18:01:23+05:30 IST

కావలసిన పదార్థాలు: కాకరకాయలు - పావు కిలో, ఉల్లి కారం - 2 టే.

కాకరకాయ ఉల్లికారం

కావలసిన పదార్థాలు: కాకరకాయలు - పావు కిలో, ఉల్లి కారం - 2 టే.స్పూన్లు, ఉప్పు - తగినంత, జీలకర్ర - 1 టీస్పూను, నూనె - 2 టే.స్పూన్లు, కరివేపాకు - 2 రెమ్మలు, కొత్తిమీర - 1 కట్ట
తయారీ విధానం: కాకరకాయలు తొక్కుతీసి కడిగి మధ్యకు కట్‌ చేసుకోవాలి. ఈ ముక్కలకు గాట్లు పెట్టి పక్కనుంచాలి. ఉల్లికారం, ఉప్పు కలుపుకోవాలి. ఈ ముద్దను గాట్లు పెట్టిన కాకరకాయల్లో కూరి పక్కనుంచాలి. బాండ్లీలో నూనె పోసి జీలకర్ర, కరివేపాకు వేయించి కాకరకాయ ముక్కలు వేసి మూత పెట్టి చిన్నమంట మీద ఉడికించాలి. తరచుగా ముక్కల్ని గరిటెతో తిప్పుతూ అన్ని వైపులా సమంగా ఉడికించాలి. ముక్కలు బాగా ఉడికాక కొత్తిమీర చల్లి దింపాలి.

Updated Date - 2015-09-23T18:01:23+05:30 IST