కందిపప్పు తెలగపిండి

ABN , First Publish Date - 2015-08-29T23:07:27+05:30 IST

కావలసిన పదార్థాలు: కందిపప్పు - 1 కప్పు, తెలగపిండి - అరకప్పు, ఎండుమిర్చి - 4, మినప్పప్పు, ఆవాలు,

కందిపప్పు తెలగపిండి

కావలసిన పదార్థాలు: కందిపప్పు - 1 కప్పు, తెలగపిండి - అరకప్పు, ఎండుమిర్చి - 4, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర - అర టీ స్పూను చొప్పున, ఇంగువ - చిటికెడు, వెల్లుల్లి రేకలు - 4, కరివేపాకు - 4 రెబ్బలు.
తయారుచేసే విధానం : ముందుగా కప్పు నీరు మరిగించి అందులో తెలగపిండి వేసి మూతపెట్టి మెత్తగా ఉడికించి చల్లార్చి ఆరబెట్టాలి. మరో గిన్నెలో కందిపప్పు (బద్దలుగా) ఉడికించాలి. కడాయిలో నూనె వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి రేకలు, మినప్పప్పు, ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించాలి. తర్వాత ఉప్పు, తెలగపిండి, కందిపప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉంచి దించేయాలి. వేడి వేడి అన్నంతో తింటే ఎంతో రుచిగా ఉండే కూర ఇది

Updated Date - 2015-08-29T23:07:27+05:30 IST