చిక్కుడు బోండాలు

ABN , First Publish Date - 2015-09-04T17:56:18+05:30 IST

కావలసిన పదార్థాలు: చిక్కుడు గింజలు - అరకేజి, మైదా - 250 గ్రా., జీలకర్ర- 10 గ్రా., ధనియాలు- 10 గ్రా

చిక్కుడు బోండాలు

కావలసిన పదార్థాలు: చిక్కుడు గింజలు - అరకేజి, మైదా - 250 గ్రా., జీలకర్ర- 10 గ్రా., ధనియాలు- 10 గ్రా., కారం - 5 గ్రా., గరం మసాల - 25 గ్రా., కొత్తిమీర - 25 గ్రా., నిమ్మరసం - 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, వేరుశనగ నూనె - వేగించడానికి తగినంత.
తయారుచేసే విధానం: ముందుగా మైదాలో అర టీ స్పూను ఉప్పు, ఒక టీ స్పూను నూనె వేసి నీటితో గట్టి ముద్దలా కలిపి అరగంటపాటు నానబెట్టాలి. చిక్కుడు గింజల్ని పొట్టు తీసి చేత్తో నలిపి ఒక గిన్నెలో వేయాలి. వీటికి మిగతా పదార్థాలన్నీ కూడా జతచేస్తూ బాగా కలపాలి. మైదా ముద్దలోంచి కొద్దికొద్దిగా పిండి తీసుకుని మధ్యలో చిక్కుడు మిశ్రమాన్ని పెట్టి బోండాల్లా చేసుకుని కత్తితో చుట్టూ గాట్లు పెట్టుకోవాలి. వీటిని దోరగా వేగించి తీశాక కొద్దిసేపు టిష్యూ పేపర్‌పై ఉంచితే నూనెని పీల్చుకుంటుంది. వేడివేడి చిక్కుడు బొండాలను టమేటో సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి. చిక్కుడు బదులు ఇతర కూరల మిశ్రమమైనా వాడొచ్చు.

Updated Date - 2015-09-04T17:56:18+05:30 IST