దోసకాయ నువ్వుల కూర

ABN , First Publish Date - 2015-09-03T16:55:40+05:30 IST

కావలసిన పదార్థాలు: దోసకాయ ముక్కలు - రెండు కప్పులు, టమాటాలు - రెండు, ఉల్లిపాయలు - రెండు

దోసకాయ నువ్వుల కూర

కావలసిన పదార్థాలు: దోసకాయ ముక్కలు - రెండు కప్పులు, టమాటాలు - రెండు, ఉల్లిపాయలు - రెండు, పచ్చిమిర్చి - నాలుగు, కరివేపాకు - రెండు రెబ్బలు, పసుపు - చిటికెడు, కారం - ఒక టీస్పూను, అల్లం వెల్లుల్లి ముద్ద - అర టీ స్పూను, దనియాలు - ఒక టీస్పూను, నువ్వులు - నాలుగు టీస్పూనులు, ఉప్పు - రుచికి తగినంత
తయారుచేసే విధానం: నువ్వులు, దనియాలు దోరగా వేగించి పొడి చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు దోరగా వేగించాలి. ఇందులో పసుపు, కారం పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేగాక దోసకాయ ముక్కలతో పాటు ఉప్పు, టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టాలి. మగ్గాక నీళ్ళు పోసి దగ్గర పడ్డాక నువ్వుల పొడి, దనియాల పొడి చల్లి దింపుకోవాలి.

Updated Date - 2015-09-03T16:55:40+05:30 IST