గుత్తి మిరప కూర

ABN , First Publish Date - 2015-09-03T17:27:21+05:30 IST

కావలసినవి: పెద్ద సైజు బజ్జీ మిరపకాయలు 250 గ్రా., ఉడికించి ముద్ద చేసిన బంగాళాదుంపలు

గుత్తి మిరప కూర

కావలసినవి: పెద్ద సైజు బజ్జీ మిరపకాయలు 250 గ్రా., ఉడికించి ముద్ద చేసిన బంగాళాదుంపలు 100 గ్రా., తురిమిన పనీర్‌ 100 గ్రా., తరిగిన పచ్చిమిర్చి అర టేబుల్‌ స్పూను, చాట్‌ మసాలా పొడి అర టీ స్పూను, కారం అర టీ స్పూను, ఉప్పు తగినంత, గిలక్కొట్టిన పెరుగు ఒక కప్పు, నూనె ఒక టేబుల్‌ స్పూను, ఆవాలు అర టీ స్పూను, జీలకర్ర అర టీ స్పూను, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ ఒక టేబుల్‌ స్పూను.
ఎలా చేయాలి
పచ్చిమిరపకాయల్ని చీల్చి లోపల ఉన్న గింజల్ని తీసేసి నీళ్లలో బాగా కడగాలి. బంగాళాదుంపల ముద్దలో పచ్చిమిర్చి ముక్కలు, చాట్‌ మసాలా, కారం, పనీర్‌, ఉప్పు వేసి బాగా కలిపి ఈ పచ్చిమిరపకాయల్లో కూరాలి. బాణలిలో నూనె పోసి ఈ మిరపకాయల్ని బజ్జీల్లా వేగించాలి. గ్రేవీ కోసం: నూనెని వేడి చేసి జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కల్ని వేసి కొద్దిసేపు వేగించాలి. వీటిని పెరుగులో వేసి బాగా కలపాలి. ఒక ప్లేటులో ఈ మిశ్రమాన్ని పోసి దాని మీద మిరపకాయల్ని అమర్చాలి. లోపల కూరడానికి బంగాళ దుంప గుజ్జే కాకుండా రకరకాల కూరగాయ ముక్కల్ని, కైమా, రొయ్య, చేప దేన్నయినా ఉపయోగించవచ్చు.

Updated Date - 2015-09-03T17:27:21+05:30 IST