హెర్బల్‌ స్ర్పౌట్స్‌ కర్రీ

ABN , First Publish Date - 2015-09-03T17:29:05+05:30 IST

కావలసిన పదార్థాలు: మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి పెసలు, అలసందలు, శనగలు, బఠానీలను

హెర్బల్‌ స్ర్పౌట్స్‌ కర్రీ

కావలసిన పదార్థాలు: మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి పెసలు, అలసందలు, శనగలు, బఠానీలను నానబెట్టి మొలకలు చేయాలి. పచ్చిమిర్చి, టమోట, ఉల్లిపాయ, వెల్లుల్లి, మెంతికూర, ఉప్పు, తులసి ఆకులు, పసుపును సరిగ్గా ఉపయోగించాలి.
తయారీ విధానం :
మొక్కలు వచ్చిన పెసలు, అలసందలు, శనగలు, బఠానీలను కుక్కర్‌లో వేసి రెండు విజిల్స్‌ వచ్చేవరకు ఉడకబెట్టిలి. తర్వాత పచ్చిమిర్చి, టమోట, ఉల్లిపాయ, మెంతికూర, ఉప్పు, నీళ్లు పోసి పది నిమిషాలు ఉడకబెట్టి పేస్ట్‌ చేయాలి. తర్వాత పోపు వేసి అందులో తులసి ఆకులు, ఉల్లిపాయలు వేయాలి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మొలకలను ఆ పేస్టులో వేసి కలపాలి. దీంతో హెర్బల్‌ స్ర్పౌట్స్‌ కర్రీ రెడీ అయినట్టే. ఇది చపాతీ, పూరీల్లోకి భలే బావుంటుంది.

Updated Date - 2015-09-03T17:29:05+05:30 IST