వెజ్ ఫ్రైడ్ రైస్
ABN , First Publish Date - 2015-09-01T18:39:32+05:30 IST
కావలసిన పదార్థాలు : బాస్మతి రైస్ - 3 కప్పులు, ఉల్లికాడ తరుగు - అర కప్పు,
కావలసిన పదార్థాలు : బాస్మతి రైస్ - 3 కప్పులు, ఉల్లికాడ తరుగు - అర కప్పు, (సన్నగా, పొడుగ్గా తరిగిన) క్యాప్సికం - 1, (రెండు నిమిషాలు ఉడికించిన) బీన్స్, క్యారెట్, క్యాబేజ్ తరుగు - 2 కప్పులు, వెనిగర్ - ముప్పావు టేబుల్ స్పూను, మిరియాలపొడి, ఉప్పు - రుచికి తగినంత, నూనె - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం : నూనెలో ఉల్లికాడ తరుగు దోరగా వేగించి మిగతా కూరగాయల తరుగు కూడా కలిపి 4 నిమిషాలు వేగించాలి. ఉప్పు, మిరియాలపొడి వేసి నిమిషం తర్వాత చల్లారిన అన్నం వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు సోయా సాస్ వేసి (హై ఫ్లేమ్‌లో) బాగా కలిపి, తర్వాత సర్వ్ చేయాలి.