పాలక్‌ పులావ్‌

ABN , First Publish Date - 2015-09-01T17:17:30+05:30 IST

కావలసిన పదార్థాలు : పాలకూర - రెండు కట్టలు, ఉల్లిపాయ - పెద్దది 1, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, పచ్చిమిర్చి (ముద్ద) - 6, టమోటా - 1,

పాలక్‌ పులావ్‌

కావలసిన పదార్థాలు : పాలకూర - రెండు కట్టలు, ఉల్లిపాయ - పెద్దది 1, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, పచ్చిమిర్చి (ముద్ద) - 6, టమోటా - 1, జీలకర్ర, మిరియాలు కలిపి దంచిన పొడి - ఒకటిన్నర స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నిమ్మరసం - రెండు టీ స్పూన్లు, కరివేపాకు - రెండు రెబ్బలు, కొత్తిమీర - 1 కట్ట.
తయారుచేసే విధానం: ఉల్లిపాయని పొడవు ముక్కలుగా తరిగి పక్కనుంచు కోవాలి. పాలకూర నీటిలో ఉడికించి పేస్టులా చేసుకోవాలి. దళసరి అడుగున్న కడాయిలో కరివేపాకు, మిగిలిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చిముద్ద వేసి వేగించుకోవాలి. టమోటా ముక్కలు, మిరియాల, జీలకర్ర పొడులతో పాటు బియ్యం, ఉప్పుకూడా వేసి మరికాసేపు వేగించి ఒకటికి ఒకటిన్నర చొప్పున నీరు జతచేస్తూ సన్నని మంటపైన ఉడికించాలి. అన్నం ఉడుకుతుండగా పాలకూర ముద్దను వేయాలి. దించేముందు నిమ్మరసం కలపాలి. పైన ఉల్లిపాయ ముక్కల్ని, కొత్తిమీరను, వేగించిన జీడిపప్పుని అలంకరించుకోవచ్చు.

Updated Date - 2015-09-01T17:17:30+05:30 IST