పాలకూర, కొబ్బరన్నం

ABN , First Publish Date - 2015-09-01T17:22:55+05:30 IST

కావలసిన పదార్థాలు: పాలకూర తురుము - 1 కప్పు, కొబ్బరి కోరు - 2 టేబుల్‌ స్పూన్లు, బాసుమతి బియ్యం - 1 కప్పు, నీరు - ఒకటిన్నర కప్పులు, ఎండుమిర్చి - 2,

పాలకూర, కొబ్బరన్నం

కావలసిన పదార్థాలు: పాలకూర తురుము - 1 కప్పు, కొబ్బరి కోరు - 2 టేబుల్‌ స్పూన్లు, బాసుమతి బియ్యం - 1 కప్పు, నీరు - ఒకటిన్నర కప్పులు, ఎండుమిర్చి - 2, మిరియాలపొడి, పసుపు, ఆవాలు, శనగపప్పు - పావు టీ స్పూను చొప్పున, కరివేపాకు - 4 రెబ్బలు, నూనె - 2 టీ స్పూన్లు.
తయారుచేసే విధానం: బాసుమతి బియ్యాన్ని చల్లని నీటిలో పావుగంట నానబెట్టాలి. నూనెలో ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, శనగపప్పు, కరివేపాకు వేగించి కొబ్బరి కోరు కలపాలి. 2 నిమిషాల తర్వాత పాలకూర తరుగు వేసి మూతపెట్టాలి. ఆకు మెత్తబడ్డాక మిరియాలపొడి, ఉప్పుతో పాటు బియ్యం కలిపి నీరుపోసి మూతపెట్టాలి. ఈ రైస్‌తో బనానా చిప్స్‌ నంజుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

Updated Date - 2015-09-01T17:22:55+05:30 IST