పాలక్‌ బిర్యానీ

ABN , First Publish Date - 2015-08-31T23:32:20+05:30 IST

కావలసిన పదార్థాలు: పాలకూర - 1 కట్ట, బాసుమతి బియ్యం - 1 కప్పు, ఉల్లిపాయ - 1, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్‌ స్పూను, పచ్చిమిర్చి - 4,

పాలక్‌ బిర్యానీ

కావలసిన పదార్థాలు
 
పాలకూర - 1 కట్ట, బాసుమతి బియ్యం - 1 కప్పు, ఉల్లిపాయ - 1, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్‌ స్పూను, పచ్చిమిర్చి - 4, దాల్చిన చెక్క - అంగుళం ముక్క, షాజీరా - పావు టీ స్పూను, బిర్యానీ ఆకు - 1, జీడిపప్పు - 10, మిరియాల పొడి - పావు టీ స్పూను, లవంగాలు - 3, గరం మసాల - అర టీ స్పూను, బంగాళ దుంపలు - 2, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, నూనె/ నెయ్యి - 1 టేబుల్‌ స్పూను.
 
తయారీ విధానం
 
బియ్యం అరగంట సేపు నానబెట్టాలి. నూనె / నెయ్యిలో దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, షాజీరా, పచ్చిమిర్చి, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లి తరుగు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. తర్వాత బంగాళ దుంప ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాల, పాలక్‌పేస్టు కలిపి మూత పెట్టి చిన్నమంటపై మగ్గించాలి. ముక్కలు సగం ఉడికిన తర్వాత బియ్యం వేసి రెండు నిమిషాలు వేగించి ఒకటిన్నర కప్పుల నీరుపోసి తగినంత ఉప్పు వేసి నీరు ఆవిరయ్యాక మంట పూర్తిగా తగ్గించాలి. దించేముందు వేగించిన జీడిపప్పులు అలంకరించాలి. 

Updated Date - 2015-08-31T23:32:20+05:30 IST