బెండకాయ బెంగాలీ కర్రీ

ABN , First Publish Date - 2015-08-31T20:21:42+05:30 IST

కావలసిన పదార్థాలు: బెండకాయలు - పావు కిలో, పచ్చిమిర్చి - 1, మెంతులు, సోంపు, ఆవాలు, వాము, జీలకర్ర - పావు టీ స్పూను చొప్పున,

బెండకాయ బెంగాలీ కర్రీ

కావలసిన పదార్థాలు: బెండకాయలు - పావు కిలో, పచ్చిమిర్చి - 1, మెంతులు, సోంపు, ఆవాలు, వాము, జీలకర్ర - పావు టీ స్పూను చొప్పున, ఆవనూనె - 1 టేబుల్‌ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, పంచదార - చిటికెడు, అల్లం పొడి - అర టీ స్పూను.
తయారుచేసే విధానం: బెండకాయల్ని అర అంగుళం ముక్కలుగా తరిగి ఉంచుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి, మంట స్విమ్‌ చేసి మెంతులు, సోంపు, ఆవాలు, వాము, జీలకర్ర వేగించాలి. తర్వాత తరిగిన బెండకాయలు, మిర్చి, ఉప్పు వేసి, రెండు నిమిషాల తర్వాత పసుపు, అల్లం పొడి కలిపాలి. 5 నిమిషాలయ్యాక కొద్దిగా నీళ్లు చిలకరించి మూతపెట్టి మగ్గనివ్వాలి. దించేముందు పంచదార చిలకరించాలి. కమ్మటి వాసనతో ఉండే ఈ కూర బెంగాలీ వంటకం.

Updated Date - 2015-08-31T20:21:42+05:30 IST