Abn logo

అరటిపువ్వు గుజ్జుకూర

కావలసిన వస్తువులు: ములక్కాడలు - 2, అరటి పువ్వు- 20 గుత్తులు, నూనె- వంద గ్రాములు, ఆవాలు- పావు టీ స్పూను, కరివేపాకు- 4 రెబ్బలు, టమేటో గుజ్జు- వంద గ్రాములు, పచ్చికొబ్బరి కాయ- 1, సోంపు- 1 టీ స్పూను, ధనియాల పొడి- 20 గ్రాములు, పసుపు- చిటికెడు, కారం- 20 గ్రాములు, ఉప్పు- సరిపడా, జీడిపప్పు- 2 టేబుల్‌ స్పూన్లు.
తయారుచేసే విధానం: ములక్కాడల్ని 2 అంగుళాల పొడవున కట్‌ చేసుకుని, అరటిపువ్వుని శుభ్రం చేసుకొని రెండిటిని కాస్త పసుపు వేసి వేరువేరుగా ఉడికించి ఉంచుకోవాలి. కొబ్బరిని, జీడిపప్పుని మెత్తగా పేస్టులా చేసిపెట్టుకోవాలి. కడాయిలో నూనె వేడి చేసి పోపుగింజలు, కరివేపాకు చిటపటమన్నాక టమేటో గుజ్జు, కారం, ఉప్పు ధనియాల పొడి, పసుపు వేసి వేగించాలి. తరువాత కొబ్బరిపేస్టుని వేసి దగ్గరగా ఉడికించాలి. ఇప్పుడు ములక్కాడ ముక్కల్ని, అరటిపువ్వుని వేసి మరో ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. ఈ కూర వేడివేడి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది

అడవుల జల్లెడ..సరిహద్దుపై నిఘామద్యం మత్తులో..భార్యను హత్య చేసిన భర్తఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానంగిరిజన మహిళ ఆత్మహత్యపై విచారణ వేగవంతం చేయాలికొనసాగుతున్న ‘కరోనా’ ఉధృతిముందుచూపేదీ?మన్యంపై మావోయిస్టుల నీడడాక్యుమెంట్‌ రైటర్లకు మళ్లీ లైసెన్సులు...?అయ్యో.. సారూ!అధికారులు సమన్వయంతో పనిచేయాలి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement