Abn logo

ఆలు మిర్చీ బజ్జీ

కావలసిన పదార్థాలు: లావు మిర్చీలు - 5, శనగపిండి - 100గ్రా., ఉప్పు - రుచికి తగినంత, వాము - 3 గ్రా., కారం - 5 గ్రా., ఉడికించిన బంగాళదుంపలు -3, ఎండు మామిడిపొడి - 3 గ్రా., జీరాపొడి -3 గ్రా., నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: ఉడికించిన బంగాళదుంపల తొక్కతీసి మెదిపి అందులో కారం, జీరాపొడి, మామిడి పొడి వేసి బాగా కలిపి ముద్దలా చేసిపెట్టుకోవాలి. మిర్చీలను నిలువునా మధ్యలోకి చీరి, గింజల్ని తీసేసి అందులో బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టాలి. ఇప్పుడు శనగపిండిలో ఉప్పు, వాము వేసి నీటితో చిక్కని జారుగా కలుపుకోవాలి. మిర్చీలను శనగపిండి జారులో ముంచి ఒక మోస్తరు వేడిపై నూనెలో దోరగా వేగించుకోవాలి. వేడివేడి మిర్చీ బజ్జీలు ఎంతో రుచిగా ఉంటాయి. ఇష్టం ఉన్నవారు పుదీనా చట్నీతో తినవచ్చు.

అడవుల జల్లెడ..సరిహద్దుపై నిఘామద్యం మత్తులో..భార్యను హత్య చేసిన భర్తఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానంగిరిజన మహిళ ఆత్మహత్యపై విచారణ వేగవంతం చేయాలికొనసాగుతున్న ‘కరోనా’ ఉధృతిముందుచూపేదీ?మన్యంపై మావోయిస్టుల నీడడాక్యుమెంట్‌ రైటర్లకు మళ్లీ లైసెన్సులు...?అయ్యో.. సారూ!అధికారులు సమన్వయంతో పనిచేయాలి
Advertisement
d_article_rhs_ad_1
Advertisement