ఆలూ రాజ్మా టిక్కా

ABN , First Publish Date - 2015-08-30T18:24:43+05:30 IST

కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు-3, రాజ్మా గింజలు -3 టేబుల్‌ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ -1,

ఆలూ రాజ్మా టిక్కా

కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు-3, రాజ్మా గింజలు -3 టేబుల్‌ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ -1, అల్లం వెల్లుల్లి పేస్టు- రెండున్నర టీస్పూన్లు, మామిడి పొడి - ఒకటిన్నర టేబుల్‌ స్పూను, రాజ్మా మసాలా పొడి-1 టీ స్పూను, ధనియా, జీరా పొడి-1 టీస్పూను, పసుపు- పావు స్పూను, కారం-2 టీస్పూన్లు, పుదీనా-1 కట్ట, కొత్తిమీర - 1 కట్ట, మొక్కజొన్న పిండి - 3 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు- రుచికి తగినంత, నూనె వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం
రాజ్మాను ఒక రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఉడికించి, ఆరబెట్టి, మెదిపి పక్కనుంచుకోవాలి. ఉడికించిన బంగాళదుంపల్ని మెదిపి అందులో రాజ్మాతో పాటు తక్కిన పదార్థాలను వేసి బాగా కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసుకుని మొక్కజొన్న పిండిలో దొర్లించి, కాస్త ఒత్తుతూ పెనంపై రెండు వైపులా బంగారు రంగు వచ్చేలా వేగించుకోవాలి. వీటిని వేడివేడిగా పెరుగు చెట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-08-30T18:24:43+05:30 IST