అరటికాయ కోఫ్తా కర్రీ

ABN , First Publish Date - 2015-08-30T20:21:02+05:30 IST

కావలసిన పదార్థాలు : అరటికాయలు - 4, ఉల్లిపాయలు - 3, టమోటాలు - పావు కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 3 చెంచాలు, పచ్చిమిరపకాయలు - 6,

అరటికాయ కోఫ్తా కర్రీ

కావలసిన పదార్థాలు : అరటికాయలు - 4, ఉల్లిపాయలు - 3, టమోటాలు - పావు కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ - 3 చెంచాలు, పచ్చిమిరపకాయలు - 6, కొత్తిమీర - కట్ట, మిరియాల పొడి - అర చెంచా, పెరుగు - కప్పు, ధనియాల పొడి - చెంచా, జీడిపప్పు - 50గ్రా, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడ, పసుపు - చిటికెడు, కారం - రెండు చెంచాలు, కొత్తిమీర - కట్ట, పుదీనా - కట్ట, గరం మసాల - అరచెంచా, కొబ్బరి పొడి - చెంచా.
తయారీ విధానం :
అరటికాయలను ఉడికించి పై చెక్కు తీసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. బాణలిలో నూనె పోసి వేగాక ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం వేయించి అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. ఆ మిశ్రమంలో జీడిపప్పు పేస్టును కూడా వేసి కలపి ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను డీప్‌ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పాత్రలో నూనె పోసి పోపు వేసుకుని అందులో రుబ్బిన ఉల్లిపాయ, టమోట ముద్ద, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, ఉప్పు , గరం మసాల, ధనియాల పొడి, కొబ్బరి పొడి, పెరుగు జీడిపప్పు పేస్టు కొంచెం వేసుకుని ఉడికించాలి. కొంచెం ఉడికి నూనె పైకి తేలిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న అరటి కోఫ్తా బాల్స్‌ని అందులో వేసి పది నిమిషాలు ఉడికించి దించేయాలి.

Updated Date - 2015-08-30T20:21:02+05:30 IST