ద్రాక్ష రైతా

కావాల్సిన పదార్థాలు
 
పెరుగు - రెండు కప్పులు, ద్రాక్షపండ్లు (నిలువుగా రెండు భాగాలు తరిగి) - ఒక కప్పు, పంచదార - ఒకటిన్నర టీస్పూన్‌, ఉప్పు - సరిపడా, వేగించిన జీలకర్ర పొడి - రెండు చిటికెలు, కారం - చిటికెడు, పుదీనా - అలంకరణకు.
 
 
తయారీ విధానం
 
చిక్కటి పెరుగును పెద్ద గిన్నెలో వేసి గిలక్కొట్టి జారుగా చేయాలి.
ఇందులో ఉప్పు, సరిపడా పంచదార వేయాలి. పంచదార కరిగేవరకు కలపాలి.
తరువాత ద్రాక్షపండ్ల ముక్కలు వేసి ముక్కలకు పెరుగు బాగా పట్టే వరకు కలపాలి.
జీలకర్రపొడి, కారం, పుదీనాలతో అలంకరించాలి. ఓ నాలుగు ద్రాక్షపండ్ల ముక్కలు పైన వేస్తే... చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది.
ఈ రైతాను పులావ్‌, బిర్యానీలతో తినొచ్చు. లేదంటే వట్టిదే కూడా తినొచ్చు.

పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలుసీసీ రోడ్డుపైనే బీటీ రోడ్డు నిర్మాణంపైకప్పు కూలినా.. పట్టింపు కరువుహెల్మెట్‌ ధరిస్తేనే రోడ్లపైకి అనుమతి : సీఐమూడు దశాబ్దాల సమస్యకు పరిష్కారం!కమ్ముకుంటున్న కారుమబ్బులువానాకాలం సాగుకు రైతులు సన్నద్ధంనత్తనడకన బావి నిర్మాణ పనులుతాంసిలో ఈదురు గాలులుమటన్‌ షాపుల వద్ద సండే సందడి
Advertisement
Advertisement