రాడిష్‌ రైతా

ABN , First Publish Date - 2015-08-30T21:27:27+05:30 IST

కావలసిన పదార్థాలు: రాడిష్‌ - 1, పచ్చిమిర్చి - 1, పెరుగు - 1 కప్పు, పంచదార - అర టీ స్పూను, ఉప్పు

రాడిష్‌ రైతా

కావలసిన పదార్థాలు: రాడిష్‌ - 1, పచ్చిమిర్చి - 1, పెరుగు - 1 కప్పు, పంచదార - అర టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - గుప్పెడు, నూనె - 1 టేబుల్‌ స్పూను, ఆవాలు - పావు టీ స్పూను.
తయారుచేసే విధానం: రాడిష్‌ను శుభ్రం చేసి తురుముకోవాలి. పెరుగులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, పంచదారతో పాటు రాడిష్‌ తరుగు కూడా వేయాలి. తర్వాత ఆవాలు వేగిన తాలింపుని పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఇష్టమైతే వేగించి పొట్టుతీసిన వేరుశనగపప్పుని కలుపుకోవచ్చు. ఈ రైతా పరాటాలతో బాగుంటుంది.

Updated Date - 2015-08-30T21:27:27+05:30 IST