మామిడి రైతా

ABN , First Publish Date - 2015-08-30T21:23:42+05:30 IST

కావలసిన పదార్థాలు: చిక్కని పెరుగు - 300 గ్రా., పంచదార పొడి - 4 టీ స్పూన్లు, తీపి మామిడిపండు గుజ్జు- 1 క ప్పు

మామిడి రైతా

కావలసిన పదార్థాలు: చిక్కని పెరుగు - 300 గ్రా., పంచదార పొడి - 4 టీ స్పూన్లు, తీపి మామిడిపండు గుజ్జు- 1 క ప్పు, తీపి, పచ్చి మామిడిపండ్ల ముక్కలు (చిన్నగా కోసినవి)- పదేసి, దానిమ్మ పండు గింజలు - అకప్పు, నూనె - 2 టీ స్పూన్లు, ఆవాలు - అరస్పూను, కరివేపాకు - పది రెబ్బలు
తయారుచేసే విధానం
ఒక గిన్నెలో పెరుగు వేసి మామిడి గుజ్జును, పంచదార పొడిని వేసి అన్నీ బాగా కలిసేలా గిలకొట్టాలి. తర్వాత పచ్చి, పండు మామిడిముక్కల్ని, దానిమ్మ గింజల్ని వేసి మరోసారి కలపాలి. స్టౌవ్‌ పై మూకుడులో నూనె వేడెక్కాక ఆవాలు, కరివేపాకు వేసి, అవి చిటపటలాడేక నూనెతో సహా మామిడి రైతాలో కలపాలి. దీన్ని చల్లగా తింటేనే బాగుంటుంది. పిల్లలు పూరీలతో ఈ రైతాను ఇష్టంగా తింటారు కూడా. 

Updated Date - 2015-08-30T21:23:42+05:30 IST