పాలకూర ఆపిల్ వాల్నట్ సలాడ్
v id="pastingspan1">
కావలసిన పదార్థాలు
లేత పాలకూర - 2 కప్పులు, ఆపిల్ - 1, వేగించిన వాల్నట్స్ - 1/2 కప్పు, నిమ్మరసం - తగినంత, తేనె - 1 స్పూను, ఉప్పు - కొద్దిగా, ఆలివ్ నూనె - 2 స్పూనులు, మిరియాల పొడి - కొద్దిగా.
తయారుచేసే విధానం
పాలకూరను బాగా కడిగి గాలికి ఆరబెట్టిన తర్వాతే తరిగి పెట్టుకోవాలి. ఆపిల్‌ను ముక్కలుచేసి వాటికి నిమ్మరసం కలపండి. ఒకగిన్నెలో పాలకూర తరుగు, ఆపిల్ ముక్కలు, వేగించిన వాల్నట్స్ వేసి దానిలో ఆలివ్ ఆయిల్, ఉప్పు, మిరియాల పొడి కలపండి. దీనిని భోజనానికి ముందు పైన కొద్దిగా తేనె, మరికొంచం నిమ్మరసం పిండి సలాడ్‌లా ఇస్తే సరిపోతుంది. ముందుగా తయారుచేసుకుని ఫ్రిడ్జ్‌లో ఉంచి చల్లగా తింటే మరింత రుచిగా ఉంటుంది. ఈ సలాడ్‌లో విటమిన్ ‘సి’, ఐరన్, మరియు గుండెకు మంచిచేసే ఫాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.