కావ
లసినవి: చిన్నసైజు రసగుల్లాలు 200 గ్రా., చిక్కటితీపి పెరుగు 300 గ్రా., (చిలక్కొట్టుకోవాలి), వేగించిన అప్పడాల ముక్కలు 50 గ్రా., వేగించిన జీలకర్రపొడి అర టీ స్పూను, కొంచెం కొత్తిమీర.
తయారుచేసే విధానం
చిలక్కొట్టుకున్న తియ్యటి పెరుగును ఒక బౌల్‌లో వేసి దానిలో జీలకర్రపొడి కలపాలి. ఫ్రిజ్‌లో పెట్టి చల్లారాక పాకం లేకుండా ఒట్టి రసగుల్లాలను మాత్రం దానిలో వేసి అప్పడాల ముక్కలు, కొత్తిమీర పైన చల్లి తినండి. వెరైటీ టేస్ట్.