కాప్సికం రైతా

ABN , First Publish Date - 2015-08-30T00:18:19+05:30 IST

కావలసిన పదార్థాలు: పెరుగు - 3 కప్పులు, దోసకాయ -1, కాప్సికం - 2, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - 2

కాప్సికం రైతా

కావలసిన పదార్థాలు: పెరుగు - 3 కప్పులు, దోసకాయ -1, కాప్సికం - 2, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర - 2 టేబుల్‌ స్పూన్లు, నూనె - కొద్దిగా.
తయారుచేసే విధానం: కాప్సికం, దోసకాయని సన్నగా తరిగిపెట్టుకోవాలి. కాప్సికంని మాత్రమే నూనెలో కాసేపు వేగనిచ్చి తీసేయాలి. తర్వాత పెరుగులో ఉప్పు, దోస ముక్కలు, వేగిన కాప్సికం, కొత్తిమీరను వేసి బాగా కలపాలి. ఈ రైతా బిర్యాని, పరాటా, చపాతీల్లో దేన్లోకైనా బాగుంటుంది.

Updated Date - 2015-08-30T00:18:19+05:30 IST