వెజిటబుల్‌ పులిహోర

ABN , First Publish Date - 2015-09-02T18:20:15+05:30 IST

కావలసిన పదార్థాలు: క్యారెట్‌ ముక్కలు- 1కప్పు, బంగాళాదుంప ముక్కలు- 1కప్పు, క్యాప్సికమ్‌ ముక్కలు

వెజిటబుల్‌ పులిహోర

కావలసిన పదార్థాలు: క్యారెట్‌ ముక్కలు- 1కప్పు, బంగాళాదుంప ముక్కలు- 1కప్పు, క్యాప్సికమ్‌ ముక్కలు- అర కప్పు, దొండకాయలు-3, బీట్‌రూట్‌, క్యాబేజీ, పచ్చిబఠానీ, బీన్స్‌- 2 కప్పులు, పచ్చిమిరపకాయలు- 4, ఎండు మిరపకాయలు-4, ఇంగువ- చిటికెడు, పచ్చిసెనగపప్పు,- 2 చెంచాలు, పల్లీలు, మిరియాల పొడి, పసుసు, ఉప్పు- తగినంత, బియ్యం- అర కిలో
తయారీ విధానం :
ముందుగా బియ్యాన్ని కడిగి దానికి అన్ని కూరగాయల ముక్కలను కలిపి పొడిగా ఉండే విధంగా వండాలి. తర్వాత ఆ అన్నాన్ని వెడల్పాటి పాత్రలోకి తీసుకుని పుసుపు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం, నూనె కలపాలి. తర్వాత తాలింపు వేసి ఈ అన్నానికి కలిపితే పులిహోర రెడీ అయినట్లే.

Updated Date - 2015-09-02T18:20:15+05:30 IST