మునగాకు గారెలు

ABN , First Publish Date - 2015-12-05T15:39:47+05:30 IST

కావలసిన పదార్థాలు: మునగ ఆకు - రెండు కప్పులు, శెనగపప్పు - ఒక కప్పు, పెసరపప్పు - అర కప్పు, సన్నగా తరిగిన అల్లం - ఒక టీ స్పూను, సన్నగా తరిగిన వెల్లుల్లి - ఒక టీ

మునగాకు గారెలు

కావలసిన పదార్థాలు: మునగ ఆకు - రెండు కప్పులు, శెనగపప్పు - ఒక కప్పు, పెసరపప్పు - అర కప్పు, సన్నగా తరిగిన అల్లం - ఒక టీ స్పూను, సన్నగా తరిగిన వెల్లుల్లి - ఒక టీ స్పూను, ఉల్లిపాయ తరుగు - రెండు టేబుల్‌ స్పూన్లు, పచ్చిమిరపకాయలు - రెండు, ఉప్పు - తగినంత, కారం - తగినంత, పసుపు - చిటికెడు, జీలకర్ర - ఒక స్పూను, నూనె - తగినంత.
తయారుచేయు విధానం: శెనగపప్పు, పెసరపప్పు ఒక గంట నానబెట్టి బరకగా గ్రైండ్‌ చేయాలి. ఇందులో తగినంత ఉప్పు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ తరుగు, మునగ ఆకు, పసుపు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. కడాయిలో నూనె పోసి బాగా కాగాక ఈ పిండిని చిన్న చిన్న గారెలుగా ఒత్తుకొని నూనెలో వేయించుకోవాలి. కరకరలాడే మునగ ఆకు గారెలు తినడానికి రెడీ

Updated Date - 2015-12-05T15:39:47+05:30 IST