హోంవంటలుఅదిలాబాద్పిండి వంటకాలుఅరిసెలు v>కావాల్సిన పదార్థాలు: బియ్యం - ఒక కిలో, బెల్లం అరకిలో, నువ్వులు - 50 గ్రాములు, నూనె - తగినంత.తయారుచేయు విధానం: ఒక రోజు ముందు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నానిన బియ్యాన్ని పిండి పట్టించుకోవాలి. పిండిని జల్లించిపెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ వెలిగించి వెడల్పాటి గిన్నె పెట్టుకుని బెల్లం కొద్దిగా నీళ్లు పోసుకుని తీగ పాకం పట్టుకోవాలి. అందులో ఈ పిండిని వేసి బాగా కలిపి దించేయాలి. తరువాత స్టౌ మీద ఒక కడాయి పెట్టుకుని సరిపడా నూనె పోసుకుని బాగా కాగాక పాకంలో కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అరిటాకు మీద ఒత్తుకుని నూనె వేయాలి. రెండు వైపులా వేగేలా తిప్పుతూ వేయించాలి. ఎరుపురంగు వచ్చాక ఒక ప్లేటుపై నువ్వులు వేసి వాటిపై ఈ అరెసెలు వేసి ఒత్తాలి. అంతే అరిసెలు రెడీ. సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!