బీట్‌‌రూట్ పూర్ణాలు

ABN , First Publish Date - 2016-08-17T17:47:33+05:30 IST

బీట్‌రూట్‌ తురుము - కప్పు, బొంబాయిరవ్వ - అరకప్పు, కొబ్బరి తురుము - పావుకప్పు, పంచదార - ఒకటింపావు కప్పు, యాలకుల పొడి - రెండు

బీట్‌‌రూట్ పూర్ణాలు

కావలసిన పదార్ధాలు: బీట్‌రూట్‌ తురుము - కప్పు, బొంబాయిరవ్వ - అరకప్పు, కొబ్బరి తురుము - పావుకప్పు, పంచదార - ఒకటింపావు కప్పు, యాలకుల పొడి - రెండు చెంచాలు, మినప్పప్పు - కప్పు, బియ్యం - రెండు కప్పులు, నెయ్యి - రెండు చెంచాలు, నూనె - వేయించడానికి సరిపడా, ఉప్పు - చిటికెడు

 
తయారీ పద్ధతి: బియ్యం, మినప్పప్పును నాలుగు గంటల ముందు నానబెట్టుకుని ఆ తరువాత మెత్తగా పిండిలా రుబ్బుకుని ఉప్పు వేసుకోవాలి. ఓ గిన్నెలో అరకప్పు నీళ్ళు మరిగించి బీట్‌రూట్‌ తురుము, బొంబాయిరవ్వ, పంచదార వేసుకోవాలి. ఇందులో చెంచా నెయ్యి వేస్తే అడుగు అంటకుండా ఉంటుంది. ఐదారు నిమిషాలకు బొంబాయిరవ్వ ఉడికి మిశ్రమం దగ్గరపడుతుంది. అప్పుడు కొబ్బరితురుము, యాలకుల పొడి వేసుకుని పొయ్యి కట్టేయాలి. ఇది చల్లారాక ఉండల్లా చేసి పెట్టుకోవాలి. ఈ ఉండల్ని ముందుగా చేసిపెట్టుకున్న పిండిలో ముంచి కాగుతోన్న నూనెలో వేయాలి. ఎర్రగా వేగాక తీసేస్తే కమ్మని బీట్‌రూట్‌ పూర్ణాలు సిద్ధం.

Updated Date - 2016-08-17T17:47:33+05:30 IST