మీగడ మధుర

ABN , First Publish Date - 2016-10-09T19:00:56+05:30 IST

బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఉడికించాలి. తర్వాత బాణలిలో నెయ్యి వేసి జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం, యాలకులను వేసి వేగించాలి. తర్వాత చక్కెర పొడి,

మీగడ మధుర

కావలసిన పదార్థాలు: మీగడ- రెండు కప్పులు, బియ్యం- ఒక కప్పు, చక్కెర పొడి- అర కప్పు, గసగసాలు- రెండు స్పూన్లు(మెత్తగా రుబ్బుకోవాలి), యాలకులు- ఐదు, పచ్చికొబ్బరి తురుము- ఒక కప్పు, నెయ్యి- అర టేబుల్‌ స్పూను, జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం పలుకులు- పావు కప్పు.

 
తయారీ విధానం: బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఉడికించాలి. తర్వాత బాణలిలో నెయ్యి వేసి జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం, యాలకులను వేసి వేగించాలి. తర్వాత చక్కెర పొడి, గసగసాల ముద్ద, పచ్చికొబ్బరి తురుము వేసి మరికొంచెం సేపు వేగించి దించేయాలి. ఈ మిశ్రమంలో పాల మీగడ, ఉడికించిన బియ్యం వేసి బాగా కలపాలి. చిక్కటి ‘మీగడ మధురా’ సిద్ధం.

Updated Date - 2016-10-09T19:00:56+05:30 IST