జొన్నపిండితో వడియాలు

ABN , First Publish Date - 2018-05-12T21:36:04+05:30 IST

జొన్నపిండి-ఒక కప్పు, మంచి నీళ్లు-ఐదు కప్పులు, కారం-అర టీస్పూను, ఉప్పు-సరిపడా, ఇంగువ-చిటికెడు...

జొన్నపిండితో వడియాలు

కావలసినవి
 
జొన్నపిండి-ఒక కప్పు, మంచి నీళ్లు-ఐదు కప్పులు, కారం-అర టీస్పూను, ఉప్పు-సరిపడా, ఇంగువ-చిటికెడు.
 
తయారీవిధానం
 
జొన్నపిండిలో రెండు కప్పుల నీళ్లు కలిపి పలచగా చేయాలి. మిగిలిన నీటిని మరిగించాలి. అందులో ఉప్పు, కారం వేయాలి. మరిగిన నీళ్లల్లో జొన్న పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ పిండి ఉండలు కట్టకుండా కలపాలి. ఉడికిన తర్వాత ఇంగువ కలపాలి. చల్లారాక ఒక ప్లాస్టిక్‌ షీటుపై స్పూనుతో పిండిని కొంచెం తీసుకుని గుండ్రంగా వడియాలు పెట్టాలి. వడియాలు ఎండిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో భద్రపరచాలి. నూనెలో దోరగా వేగించి తింటే రుచిగా ఉంటాయి.

Updated Date - 2018-05-12T21:36:04+05:30 IST