సోయికూర గారెలు

ABN , First Publish Date - 2015-09-02T17:57:10+05:30 IST

కావలసిన పదార్థాలు: సోయికూర - 2 కట్టలు, పుదీనా - 1 కట్ట, ఉల్లికాడలు - 2, కొత్తిమీర - 1 కట్ట

సోయికూర గారెలు

కావలసిన పదార్థాలు: సోయికూర - 2 కట్టలు, పుదీనా - 1 కట్ట, ఉల్లికాడలు - 2, కొత్తిమీర - 1 కట్ట, కరివేపాకు - 4 రెబ్బలు, పచ్చిమిర్చి - 5, అల్లం - అంగుళం ముక్క, నూనె - వేగించడానికి సరిపడా, మినప్పప్పు, శనగపప్పు, పెసరపప్పు - ఒక కప్పు చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, పచ్చికొబ్బరి తురుము - 1 కప్పు.
తయారుచేసే విధానం: పప్పులన్నీ కలిపి అరగంట నానబెట్టాలి. సోయికూర, పుదీనా, ఉల్లికాడలు, కొత్తిమీర, కరివేపాకులను సన్నగా తరిగి ఉంచుకోవాలి. పప్పుల్ని అల్లం, పచ్చిమిర్చితో పాటు చిక్కగా, మెత్తగా రుబ్బుకోవాలి. ఒక పాత్రలో తరగిన కూరలు, కొబ్బరి తురుము, ఉప్పు, రుబ్బిన పప్పు వేసి బాగా కలపాలి. కొద్దికొద్ది పిండి తీసుకుని చేతిపై వత్తి, మధ్యలో కన్నం పెట్టి నూనెలో దోరగా వేగించాలి. వీటిని టమోటా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

Updated Date - 2015-09-02T17:57:10+05:30 IST